విజయవాడ: దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాదం చోటుచేసుకున్నది. పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాకీ పేలింది. దీంతో షాపులో ఒక్కాసారిగా మంటలు అంటుకున్నాయి.
ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh | Fire broke out in a firecracker stall setup in Gymkhana ground at Gandhi Nagar, Vijayawada, today morning. pic.twitter.com/jKJRObHgCw
— ANI (@ANI) October 23, 2022