అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మార్కాపురం( Markapuram ) జిల్లా పుల్లలచెరువు మండలంలో పిడుగుపాటుకు ( Lightning ) ఇద్దరు మృతి చెందారు. మొక్కజొన్న పరిశ్రమ వద్ద పిడుగుపాటుకు కన్నయ్య అనే కూలీ మృతి చెందాడు. మరో నలుగురుకి గాయాలు కాగా యర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు.
ఎండ్రపల్లిలో నాగయ్య అనే కూలీ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతి చెందిన ఇద్దరు బిహార్ అరారియా జిల్లాకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, పెదవేగి, జంగారెడ్డి గూడెం, బుట్టాయిగూడెం, టి.నరసాపురం, దెందులూరు మండలాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో నేలకూలిన భారీ చెట్లు నేల కూలగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి .