అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో చోటు చేసుకుంది. మృతులను శశి(12), దీపక్(10)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇద్దరు బాలురు మృతితో బోయలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.