అమరావతి : ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట మండలం గరికపాడు జాతీయ రహదారిపై ఉన్న వంతెనపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ(Vijayawada)-హైదరాబాద్(Hyderabad) వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఇటీవల వచ్చిన వరదలకు గరికపాడు వంతెన దెబ్బతింది. దీంతో పోలీసులు వన్వేను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు కార్లు ఢీ కొన్నాయి. కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరి కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.