Sai Dharam Tej | అన్న క్యాంటీన్ల వివాదం ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు మెగా మేనల్లుడిపై విరుచుకుపడుతున్నారు. దీనికి సాయి ధరమ్ తేజ్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు. దీంతో సాయిధరమ్ తేజ్, వైసీపీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.
తణుకులోని అన్న క్యాంటీన్లలో ప్లేట్లను అపరిశుభ్రమైన నీటిలో కడుగుతున్న ఒక వీడియో సోషల్‌మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. దీంతో ఎన్ఆర్ఐ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్లేట్లను సింక్‌లో కడుగుతున్న వీడియోను పోస్టు చేస్తూ.. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని సాయిధరమ్ తేజ్‌ను ప్రశ్నించారు. మీ సేఫ్ హ్యాండ్స్‌తో అన్న క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చు కదా అని సెటైర్ వేశారు. దీనికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా స్పందించారు. దీంతో డాక్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. దానికి బయో చూసుకోవాలని డాక్టర్ చెప్పారు. అందులో కడప జిల్లాకు చెందిన వ్యక్తి అని.. యూకే వైసీపీ కన్వీనర్ అని ఉంది. అది చూసిన సాయిధరమ్ తేజ్ వెంటనే ఎగ్ పఫ్‌ల స్కామ్‌ను ప్రస్తావించారు.
మెడలు రుద్దే Safe Hands ఎక్కడ @IamSaiDharamTej
అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా Safe Handsతో💦💦💦
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) August 26, 2024
ఎగ్ పఫ్స్కు సంబంధించిన బిల్లులు అంత ఎక్కువగా ఉండటంలో ఏమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు.. నాకు తెలిసి మీరు కూడా ఆ పఫ్ తిని ఉంటారని.. జాగ్రత్తగా ఉండండి సర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్‌కు డాక్టర్ ప్రదీప్ రెడ్డి కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. నా సొంతంగా ఎగ్ పఫ్ కొనుక్కొని తినగలనని.. తనకు ఎవరి సాయం అక్కర్లేదని చెప్పారు. అంతటితో ఆగకుండా తాను చిన్న పిల్లలతో జాగ్రత్తగా ఉంటానని.. వారితో మర్యాదగా ప్రవర్తిస్తానని చెప్పారు. మైనర్లతో ఆడల్ట్ కంటెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటింపజేయడం మానేయాలని సూచించారు. తాను ఆచరించేదే.. ఇతరులకు బోధిస్తానని సెటైర్ వేశారు.
డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చిన కౌంటర్‌తో సాయిధరమ్ తేజ్ సైలెంట్ అయిపోయారు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అసలు ప్రదీప్ రెడ్డి అడిగింది ఏంటి? నువ్వు చెప్పిందేంటి? అని సాయిధరమ్ తేజ్‌ను వైసీపీ నాయకులు ప్రశ్నించారు. మురికి నీళ్లతో ప్లేట్లు, గ్లాసులు కడగడమేంటని ప్రశ్నిస్తే ఎగ్‌పఫ్‌లు అంటూ టాపిక్‌ను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని నిలదీశారు. సిల్లీ విషయాలపై కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై స్పందించాలని సూచిస్తున్నారు.