AP News | కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను సపోటా తోటలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. సమయానికి ఆయన బాగోతాన్ని గమనించిన స్థానికులు బాలికను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ నాయకులు తాటిక నారాయణరావు తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి, హంసవరం సపోట తోటలోకి తీసుకెళ్లాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ అత్యాచారానికి యత్నించాడు. ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బాలికను రక్షించారు.
ఈ ఘటనపై నారాయణరావును స్థానికులు నిలదీయగా.. మూత్ర విసర్జన కోసం బాలికను అక్కడకు తీసుకొచ్చానని నారాయణ రావు బుకాయించాడు. అయినప్పటికీ స్థానికులు గట్టిగా అడగడంతో నారాయణరావు రివర్స్‌లో బెదిరింపులకు దిగాడు. నేనెవరో తెలుసా.. టీడీపీ కౌన్సిలర్‌ను .. నన్ను ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తునిలో బాలికపై హోం మంత్రి @Anitha_TDP అనుచరుడు అత్యాచారయత్నం
తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి.. హంసవరం సపోటా తోటలో టీడీపీ నేత నారాయణ రావు అత్యాచారయత్నం
కీచకుడి బాగోతాన్ని గుర్తించి బాలికను రక్షించిన… pic.twitter.com/IbbZwL58do
— YSR Congress Party (@YSRCParty) October 22, 2025