Donations | టీటీడీ ట్రస్టులకు రూ. 21 లక్షలు విరాళం అందజేత
Donations | టీటీడీ (TTD) లోని పలు ట్రస్టులకు భక్తులు శుక్రవారం రూ.21 లక్షలు విరాళంగా అందించారు.
తిరుమల : టీటీడీ (TTD) లోని పలు ట్రస్టులకు భక్తులు శుక్రవారం రూ.21 లక్షలు విరాళంగా అందించారు. ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టు(SVBC) కు రూ.11 లక్షలు, భువనేశ్వర్ కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గో సంరక్షణ (SV Gosamrakshana) ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర విరాళం డీడీలను తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి(EO Dharmareddy) కి అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 57,223 మంది భక్తులు దర్శించుకోగా 18,015 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.44 కోట్లు వచ్చిందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Donations
- SV Gosamrakshana
- SVBC
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

