తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందన్నారు.
కాకినాడకు చెందిన ప్రసన్న కోట విరూపా పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి 1,116 విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోఅదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.