TTD | ఈ నెల 18 నుంచి తిరుమల-తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం సమీక్షించారు. శ్రీవాహరి వాహన సేవలు, ఊరేగింపు నిర్వహించే మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పరిశీలించారు. గరుడ వాహన సేవలో భక్తుల రీఫిల్లింగ్ వ్యవస్థపైనా టీటీడీ అధికారులతో చర్చించారు.
సోమ, మంగళవారాల్లో తిరుమలలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో బందోబస్తు ఏర్పాట్లపై టీటీడీ అధికారులతోపాటు జిల్లా అధికారులతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చర్చించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా శ్రీవారి దర్శనం, వాహన సేవల దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ సిబ్బందికి సూచించారు. గరుడ సేవ రోజు అదనంగా వెయ్యి మంది పోలీసులతో భద్రత కల్పిస్తామన్నారు.