Tirumala | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను కొండపైకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇక్కడ తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ సౌకర్యాన్ని పొందిన తర్వాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
From August 15, FASTag is mandatory for all vehicles entering Tirumala.
✅ Vehicles without FASTag will not be allowed
✅ Follow the rules for a smooth pilgrimage#Tirumala #TTD pic.twitter.com/4rQi2y5hNA— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) August 12, 2025