అమరావతి: తిరుపతిలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం టిటిడి దాతల నుంచి విరాళాలు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం రేపు ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో విరాళాల స్వీకరణ ప్రారంభం కానుంది. https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా దాతలు విరాళాలు సమర్పించవచ్చు.
పలు కారణాల వల్ల ఇప్పటివరకు ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం వారంలో శుక్రవారం నాటికైతే రూ.1.50 కోట్లు, మిగిలిన రోజుల్లో అయితే ఒక కోటి రూపాయలను దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత అనే ప్రాతిపదికన ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకంగా ఈ సేవా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.