TTD | టీటీడీ వెబ్సైట్లో ఆలయాల సమాచారం అప్లోడ్ చేయాలి : జేఈవో
TTD | టీటీడీ వెబ్సైట్ ( TTD Website ) లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తిరుపతి : టీటీడీ వెబ్సైట్ ( TTD Website ) లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆలయాల డిప్యూటీ ఈవోలు, ఇతర అధికారులతో వర్చువల్ సమావేశం ( Virtual Meeting ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల సందర్శనకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఆయా ఆలయాల స్థల పురాణం, దూరం, వీటికి సంబంధించిన సైన్ బోర్డులు (Signboards) ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆలయాల విశిష్టతపై వివిధ భాషల్లో సంక్షిప్త సమాచారం పొందుపరచాలన్నారు. ఇందుకోసం ఐటీ, పీఆర్వో విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. త్వరలో వెబ్సైట్లో ఆలయాల సమాచారం ( Information), సేవలు, దర్శన వేళలు (Darsan timinigs )ఆలయాల్లో భక్తులకు ఉన్న సదుపాయాలు, తదితర విషయాలను ఉంచాలని ఆదేశించారు. ఎస్వీ బీసీతో సమన్వయం చేసుకుని ఆలయాల సమాచారానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తుల కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. నగరి, నారాయణవనం, బుగ్గ ఆలయాల కు టూరిజం బస్సులు వచ్చేలా ఆయా అధికారులతో చర్చించాలని వివరించారు. రిషికేష్, కురుక్షేత్ర, కన్యాకుమారి ఆలయాల అధికారులు కూడా ఆయా రాష్ట్రాల టూరిజం అధికారులతో మాట్లాడి ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసి యాత్రికుల బస్సులు ఆలయానికి వచ్చేలా చూడాలన్నారు. కొత్తగా నిర్మించిన రంపచోడవరం, సీతంపేట, జమ్ములాంటి ఆలయాల్లో భక్తుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

