TTD | తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు.
ముత్యాల నిర్మల కాంతుల వ్యాప్తికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తి పొందడానికి రాత్రి వేళ అనుకూలం. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని, ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుని బుద్ధి ముత్యంలా మారి, జనన, మరణ చక్రం నుంచి విడుదలై మోక్షం పొందుతుంది. ఇలా శ్రీవారికి ప్రీతిపాత్రమైన ముత్యాల హారాలు, రత్నాలతో కలిగే వేడిని, పుష్పాల వల్లే లభించే సుగంధాన్ని తమలో ఇనుమడింపజేసుకుని ఉత్సాహం, ప్రశాంతత పొందుతారు.