తిరుమల : ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్ చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై స్టే విధించింది.
ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. మూడురోజుల క్రితం కేసును విచారించిన సింగిల్ బెంచ్ న్యాయస్థానం ధర్మారెడ్డికి నెల రోజులు జైలుశిక్ష 2 వేల రూపాయల జరిమానా విధించింది. అయితే ఆ జరిమానా చెల్లించకుంటే మరో వారం జైలుశిక్ష పొడిగించాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు జైలు శిక్ష విధించడం తిరుమలలో హాట్ టాపిక్ గా మారింది.