తిరుమల : ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల( Tirumala) ఆలయానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించుకుంటున్నారు. శుక్రవారం విజయ వాడకు చెందిన మోనిష్ వెంకట సత్య ప్రకాష్ అనే భక్తుడు టీటీడీ (TTD ) వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం(One Crore) గా అందించారు.
ఈ మేరకు దాత తరపున ప్రతినిధి భూషణ్ తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 24 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,129 మంది భక్తులు దర్శించుకోగా 21,026 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.13 ఆదాయం వస్తుందని వివరించారు.