తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ భక్తుడు భారీ విరాళనాన్ని అందజేశారు. వెలివెన్నుకు చెందిన శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మేనేజింగ్ పార్టనర్ రవికుమార్ బురుగుపల్లి అనే భక్తుడు, సంస్థ తరపున, గురువారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు విరాళంగా ( Donations ) అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు.
శ్రీవారి హుండీకి రూ. 3.85 కోట్లు ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 70,472 మంది భక్తులు దర్శించుకోగా 25,247 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ. 3.85 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.