తిరుమల : తిరుమలలోని (Tirumala) కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును ( Dumping) టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు (Chairman BR Naidu) గురువారం పరిశీలించారు. చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త విభజన, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట టీటీడీ వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ధర్మకర్తల మండలి సభ్యులు
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ముగ్గురు సభ్యులు(TTD Members) ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో భాను ప్రకాష్ రెడ్డి, ముని కోటేశ్వరరావు, సుచిత్ర ఎల్లా(Suchitra Ella) ఉన్నారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు.