తిరుమల : తిరుపతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ( Bhumana Karunakar Reddy) టీటీడీ నూతన చైర్మన్ (TTD Chairman) గా ప్రమాణం చేశారు. గురువారం ఉదయం 11.45 నిమిషాలకుశ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి,ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. భూమన కరుణాకర్‌రెడ్డి 2006లో మొదటిసారి టీటీడీ చైర్మన్‌గా రెండేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ చైర్మన్‌గా కొనసాగిన వైవీ సుబ్బారెడ్డి దాదాపు నాలుగేళ్లపాటు పనిచేశారు. ఆయన పదవీకాలం ఈనెల 8న ముగియడంతో ఏపీ సీఎం జగన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన పేరును ఖరారు చేశారు.