అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల బంద్(Bandh called)కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ, వాల్మీకుల( Boya and Valmiki)ను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని(AP Assembly resolution) ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు(శుక్రవారం)బంద్కు పిలుపునివ్వగా మావోయిస్టు పార్టీ మద్దతు తెలిపింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు(Police) గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ముందు జాగ్రత్తగా ఏజెన్సీలో బస్సుల సర్వీసులను ఏపీ ఆర్టీసీ సంస్థ రద్దు చేసింది. అరకు,బొర్ర గుహల సందర్శనకు వచ్చే పర్యటకులు రక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని, హోటళ్లు, రిసార్ట్, లాడ్జీల్లో ఉన్న పర్యటకులను బయటకు వెళ్లనీయవద్దని ఆదివాసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.