అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను ( IAS Transfers ) బదిలీ చేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్ కుమార్ ( Shashibusan Kumar ) కు జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ బాధ్యతల నుంచి సాయిప్రసాద్‌ను రిలీవ్ చేసింది . అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.