అమరావతి: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి), ఇన్ఫీస్పార్క్, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇండియా సహకారంతో యువత, విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నిర్ణయించింది. అందుకోసం తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి వాట్సాప్ డిజిటల్ స్కిల్ అకాడమీ శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వీ రామకోటిరెడ్డి దొడ్డా, జనరల్ మేనేజర్ గోపీనాథ్, ఎన్ఎస్డీసీ స్టేట్ ఎంగేజ్మెంట్ అధికారి ప్రశాంత్, ఇన్ఫీస్పార్క్ ఫౌండర్-సీఈవో ఒషీన్ చవాన్‌తో పాటు వివిధ జిల్లాల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.