అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల ( Bapatla ) జిల్లా నగరం మండలంలో విషాదం ( Tragedy) చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరం మండలం ఈదుపల్లిలో గత కొన్ని రోజులుగా గ్రామస్థులు జ్వరాలతో ( Fevers ) బాధపడుతు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి అనే దంపతులు కూడా జ్వరంతో బాధ పడుతున్నారు.
వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మిని తెనాలి నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించే క్రమంలో సుబ్బారావు మృతి చెందాడు. భర్త చనిపోయిన గంటల వ్యవధిలోనే భార్య మహాలక్ష్మి కూడా మృతి చెందింది. ఘటనపై స్పందించిన ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ డెంగీ జ్వరాలపై ఆరా తీశారు.
డెంగీ వ్యాప్తిపై నగరంలో మండలంలో ఫీవర్ సర్వే చేయించాలని అధికారులకు ఆదేశించారు. జ్వరం ఉన్న వారికి పరీక్షలు జరిపి చికిత్స అందించాలని, డెంగీ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు పెంపొందే ప్రాంతాలను గుర్తించి శుభ్రంగా మార్చాలని, పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.