అమరావతి: గుంటూరు జిల్లా(Guntur District) కృష్ణానదిలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ అరుణోదయనగర్కు చెందిన హేమంత్ కుమార్, దుర్గాప్రసాద్ అనే ఇద్దరు నది లోతు తెలియక స్నానానికి నీటిలో దిగారు. దీంతో వారికి ఈత రాక నీట మునిగి మృతి చెందారని పోలీసులు,స్థానికులు వెల్లడించారు. ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. యువకుల మృతదేహాలను మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు( Police) వివరించారు.