అమరావతి : ఏపీలోని అనంతపురం (Anantapuram ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని కుందుర్పిలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒక ఇంటిపై నీరు నిలిచి దెబ్బతింది. ఈరోజు ఉదయం మిద్దె ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను గంగన్న, శ్రీదేవి, సంధ్యగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.