Tragedy | విషాదం.. అనంతపురం జిల్లాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
Tragedy | ఏపీలోని అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Sisters Suicide) చేసుకోవడం కలకలం సృష్టించింది.
అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Sisters Suicide) చేసుకోవడం కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని యాటకళ్ల గ్రామానికి చెందిన చాకలి నారాయణ, సరస్వతి దంపతలుకు రూప, జ్యోతి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు అనంతపురం (Anantapur ) లో డిగ్రీ చదువుకుంటూ నాలుగురోజుల క్రితం సొంతింటికి చేరుకున్నారు.
తల్లిదండ్రులు గురువారం వేరే గ్రామానికి వెళ్లగా రాత్రి ఇద్దరు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం కుమార్తెలకు తల్లిదండ్రులు ఫోన్ చేయగా వారి నుంచి సమాదానం రాకపోవడంతో పక్కింటివారికి ఫోన్ చేశారు. పొరుగున్న వారు తలుపులు తీసి లోనికి వెళ్లి చూడగా ఇద్దరు దూలానికి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు.
తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని పిల్లల మృతదేహాలను చూసి బోరున విలపించడం స్థానికుల కంట కన్నీరు తెప్పించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని(Investigation) పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

