అమరావతి : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది . మండలంలోని కోడూరు బీచ్లో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహమ్మద్ షుఫీయన్ అనే బాలుడు మృతి చెందారు.
ఇద్దరిలో ఒక బాలికను జాలర్లు కాపాడగా మరో బాలిక కోసం గాలిస్తున్నారు. బాలికను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.