అమరావతి : ఏపీలోని నంద్యాల (Nandyala) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి (Mud digging) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. దంపతులు గురుశేఖర్రెడ్డి(45), దస్తగిరమ్మ(38) , ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10) శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. మృతదేహాలను గ్రామస్థుల వెలికితీశారు.
కుటుంబంలో మొత్తం 5గురు సభ్యులుండగా దంపతుల రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుకుంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి మట్టి మిద్దె నీటితో నాని కూలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.