అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో (Manyam District) ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు (Family Suicide ) పాల్పడగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భార్య, భర మధ్య గొడవ కారణంగా విషం తాగడంతో మీనాక మధు(35), ఆయన భార్య సత్యవతి (30), కుమార్తె మోస్య(4) మృతి చెందారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు కుటుంబ సభ్యులను, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.