అమరావతి: ఏపీలోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జీలో తల్లి, కొడుకు (Mother and Son, ) ఆత్మహత్య (Suicide ) చేసుకున్న ఘటన కలకలం రేపింది. సింహాచలం( Simhachalam) అడవివరంలోని లాడ్జీలో గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్ (40) ప్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారని గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్ నాయుడు తెలిపారు.
శుక్రవారం లాడ్జీకి వచ్చిన ఇద్దరు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్‌కు చెందిన వారిగా గుర్తించామన్నారు .
వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కుమారుడు గయప్పాంజన్‌పై భార్య 2023లో నాంపల్లి స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.