అమరావతి : సంక్రాంతి పండుగ ( Sankranthi Festival ) సందర్భంగా ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. బుధవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ( Road accident ) ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అరకు మండలం చెంజీపూర్ వద్ద ఎదురెదురుగా అతివేగంగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
ఘటనలో బురిడి నిరంజన్, కిలో ముష్యా, కిలో గంగబాబు ఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. ముగ్గురి మరణంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.