అమరావతి : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా (, Sri Satyasai District) ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఎస్సీ కాలనీలో దసరా పండుగ సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. బాలాజీ అనే వ్యక్తి ఆంజనేయ స్వామి గుడిలో పూజ ముగించుకుని తిరిగి వెళ్తుండగా బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. దీంతో కారు రెండు ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు నిఖిల్ మృతి చెందగా ఆదెమ్మ అనే మహిళకు తీవ్ర గాయలయ్యాయి. ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.