అమరావతి : ఏపీలోని అనంతపురం (Anantapuram) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నార్పల మండలం కేంద్రం మెయిన్ బజార్లో ఉన్న పెద్దమ్మ సామీ గుడి వద్ద ఓ ఇంటిలో దంపతులు( Couple) కృష్ణ కిషోర్, శిరీష , ఆరు నెలల బాలుడు జయంత్‌కు ఉరివేసి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని తలుపులను పగులగొట్టి చూడగా ఇంట్లో వేలాడుతున్న మృతదేహాలను కిందకు దించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.