అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను మరవకముందే సింహాచలంలో ( Simhachalam ) గోడ కూలి ఎనిమిది మంది మృత్యువాత పడడం బాధకరమని వైసీపీ ఏపీ అధికార ప్రతినిధ లక్ష్మీపార్వతి ( Lakshmi Parvati ) అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandra Babu ) సమయంలోనే గోదావరి పుష్కరాల తొక్కిసలాట, తిరుపతిలో తొక్కిసలాట( Tirupati Stampade ) , గోవుల మృతి, నేడు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తుల మృతి చనిపోయారని విమర్శించారు.
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశృతులే జరుగుతున్నాయని ,అర్హత లేని వాళ్లు అందలం ఎక్కితే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని ఆరోపించారు. తిరుపతి ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు దుర్మణం చెందారని అన్నారు.
సింహాచలంలో ఉత్సవాల వేళ మూడు రోజుల ముందుగా గోడను కట్టడమేమిటీ అని నిలదీశారు. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే నని విమర్శించారు. దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని మండిపడ్డారు. తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందించారని పేర్కొన్నారు. సింహాచలంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.