అనంతపురం జిల్లాలో టమోట రైతుల నిరసన
Tamoto formers| టమోట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన టమోట రైతులు క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపారు.
అమరావతి : టమోట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన టమోట రైతులు క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపారు. పండించిన టమోట ను రోడ్లపై పారవేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులకు సబ్సిడీ వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయడం వల్ల నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం 15 కిలోల టమోట బాక్స్ ధర వెయ్యి నుంచి 1500 వరకు పలకగా నేడు బాక్స్కు రూ. 40లు కూడా రావడం లేదని వాపోయారు. అనంతపురం జిల్లాలో సుమారు 15వేల హెక్టార్లలో టమోటను సాగు చేసిన రైతులకు ఈ యేడాది నష్టమే మిగిలిందని అన్నారు. టమోటను పండించే రైతులకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇచ్చేదని, పంట నష్టపోతే పరిహారం ఇచ్చేవారని అన్నారు .
జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత సబ్సిడీలను ఎత్తివేయడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

