TTD |ఏపీలోని తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 13 వరకు వైభవంగా జరుగనున్నట్లు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న కోయిల్ అళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 4న బ్రహ్మోత్సవాలకు అంకురార్పన నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 7 నుంచి 8.30 గంటలకు వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు..
– ఈ నెల 5న ఉదయం -ధ్వజరోహణం, రాత్రి పెద్దశేష వాహనం
– ఈ నెల 6న ఉదయం – చిన్న శేషవాహనం, రాత్రి- హంసవాహనం
– ఈనెల 7న ఉదయం – సింహావాహనం, రాత్రి- ముత్యాల పందిరి వాహనం
– ఈ నెల 8న ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి- సర్వ భూపాల వాహనం
– ఈ నెల 9న ఉదయం – పల్లకీ ఉత్సవం, రాత్రి- గరుడ వాహనం
– ఈ నెల 10న ఉదయం – హనుమంత వాహనం, రాత్రి- గజవాహనం
– ఈ నెల 11న ఉదయం – సూర్యప్రభ వాహనం- రాత్రి- చంద్రప్రభ వాహనం
– ఈ నెల 12న ఉదయం – రథోత్సం, రాత్రి అశ్వవాహనం
– ఈ నెల 13న ఉదయం – చక్రస్నానం – రాత్రి ధ్వజావరోహణం..