PMBI | ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) రిక్రూట్మెంట్-2026లో భాగంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 178 మేనేజిరియల్/ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, అనుభవం గలవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఈ పీఎంబీఐని ప్రధానమంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన అమలు చేస్తుంది.
ఖాళీలు
జనరల్ మేనేజర్ 3
డిప్యూటీ జనరల్ మేనేజర్ 6
మేనేజర్ 6
డిప్యూటీ మేనేజర్ 4
అసిస్టెంట్ మేనేజర్ 31
సీనియర్ ఎగ్జిక్యూటివ్ 61
సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ 15
సీనియర్ ఫార్మాసిస్ట్ 6
ఎగ్జిక్యూటివ్ 10
మార్కెటింగ్ ఆఫీసర్ 30
ఫార్మాసిస్ట్ 6

Pmbi Posts
అర్హతలు
సంబంధిత పోస్టును బట్టి బీ ఫార్మా, ఎం ఫార్మా, బీఎస్సీ (మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ (సేల్స్ మార్కెటింగ్) ఉత్తీర్ణత. పని అనుభవంలో భాగంగా మేనేజర్‌కు 18, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 15, డిప్యూటీ మేనేజర్‌కు 7, అసిస్టెంట్ మేనేజర్‌కు 5, సీనియర్ మేనేజర్‌కు 3, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్‌కు 3, మార్కెటింగ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్‌కు ఏడాది అనుభవం ఉండాలి. వయసు 28 నుంచి 55 ఏండ్ల వరకు ఉండాలి.
ఎంపిక
విద్యార్హతలు, అనుభవం,రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం పోస్టును బట్టి నెలకు రూ. 32,500 నుంచి 1,58,000 వరకు ఉంది.
దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://www.pmbi.co.in/index.aspx చూడండి.