BRS Protest | కాంగ్రెస్ 1000 రోజుల విఫలపాలనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తాజా వీడియో చెప్పకనే చెబుతోంది.
హనుమకొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ విఫల పాలనకు నిరసనగా విద్యార్థులతో కలిసి భీమారం నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్కు వస్తున్న మద్దతు తట్టుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హసన్పర్తి మండలం భీమారం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణుల దాడిని ప్రతిఘటించాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. పోలీసు ఝలుం నశించాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/P9w6sAtums
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు