న్యూయార్క్: కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine) తీసుకోవడం వల్ల 28 మంది సైనికులు మృతిచెందినట్లు ఓ అమెరికా ఆర్మీ డాక్టర్ కోర్టులో తెలిపారు. దీనిపై పొలిటికో వార్తాసంస్థ ఓ కథనాన్ని రాసింది. కోవిడ్ టీకా వల్ల సుమారు 2544 మంది మృతిచెందిన ఘటనలో అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపడుతున్నది. అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌కు అడ్వైజర్‌గా చేస్తున్న థెరిసా లాంగ్ ఈ విషయాన్ని వర్జీనియా కోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్‌కు సుమారు 2544 మృతుల సమాచారం అందినట్లు లాంగ్ తన వాంగ్మూలంలో వెల్లడించారు.
మిలిటరీ సిబ్బంది కోవిడ్ టీకా తీసుకోవాలని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోవిడ్ టీకా తీసుకోని 9వేల మందిని తొలగించారు. ఇక దేశాధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ తొలగించిన సైనికులను మళ్లీ విధుల్లో చేర్చుకున్నారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా కోవిడ్19 టీకాను వేగంగా, భారీ స్థాయిలో ఉత్పత్తి చేశారు. అయితే తమ వ్యాక్సిన్ల వల్ల స్వల్ప స్థాయిలో గుండె కణజాలం వాపునకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫైజర్, మోడెర్నా సంస్థలు పేర్కొన్న విషయం తెలిసిందే.