Srikalahasti | భక్తులకు ముఖ్య గమనిక. కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
ఉదయం 4.15 గంటలకు గోమాత పూజ, తిరుమంనం, 4.30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు సర్వదర్శనం, ప్రథమకాల అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 6 గంటలకు రెండో కాల అభిషేకం, 10 గంటలకు మూడో కాల అభిషేకం, సాయంత్రం 3.30 గంటలకు ప్రదోష కాలంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ జరుగతాయని పేర్కొన్నారు.