సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ కారణంతో సెప్టెంబర్ 11న వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టంచేసింది.
కాటేజీ దాతల సిఫారసు లేఖలపై వచ్చే వారికి సైతం గదుల కేటాయింపు ఉండదని తెలిపింది. స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే వసతి గదులు కేటాయించనున్నట్టు వెల్లడించింది. దాతలు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా గదులను రిజర్వ్ చేసుకోవాలని సూచించింది. గురువారం 58,855 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, కానుకల ద్వారా రూ.4.65 కోట్ల ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు.