హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 63,535 మంది భక్తులు దర్శించుకోగా..వారిలో 28,685 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3. 81 కోట్లు వచ్చిందని తెలిపారు. ఈ నెల 10న తిరుమలలో అంగప్రదక్షిణ కోసం(శనివారం) మధ్యాహ్నం10 గంటలకు ఆన్లోన్ కోటాను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల చేస్తున్నామని వివరించారు.