హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకు మరింతగా కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారీ కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఆన్లైన్లో 500, ఆఫ్లైన్లో 1000 టికెట్లు జారీ చేయనున్నారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా ఇస్తారు. మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్టు కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీచేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.