తిరుమల : చంద్ర గ్రహణం సందర్భంగా నవంబర్ 8న తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ రోజున అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. మధ్యాహ్నం 2. 39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు ఉదయం 8. 40 గంటలకు మూసివేసి రాత్రి 7. 20 గంటలకు తిరిగి తెరవబడతాయని తెలిపారు.
వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలు, సేవలను రద్దు చేశామని పేర్కొన్నారు. ఆలయ తలుపులు తెరచిన తరువాత వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని వివరించారు.