తిరుమల : తిరుమలలో కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి చెంతకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులు కంపార్టుమెంట్లలో కాకుండా నేరుగా ఆరుగంట్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 65,901 మంది భక్తులు దర్శించుకోగా 16,991 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చిందని అధికారులువెల్లడించారు.