హైదరాబాద్: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉచిత దర్శనానికి సంబంధించిన డిసెంబర్ కోటా టోకెన్లను టీటీడీ శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. రోజుకు పదివేల చొప్పను 2 లక్షల 90 వేల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. అయితే మొత్తం టికెట్లు పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయించడంతో.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. అలాగే ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేయనున్నారు.