తిరుమల : హైదరాబాద్కు చెందిన న్యాయవాది శ్రీనివాసులు శుక్రవారం తిరుమలలో బర్డ్ (బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ , రిహాబిలిటేషన్ ఫర్ ది డిసెబుల్డ్ ) ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు. తిరుమలలోని ఈవో బంగ్లాలో శుక్రవారం విరాళం చెక్కును ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. దాత గత నెలలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఇందుకు గాను దాతను ఈవో అభినందించారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లు
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,628 మంది భక్తులు దర్శించుకోగా 33,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చిందన్నారు.