తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలువు దినం కారణంగా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan ) కలుగుతుందని టీటీడీ అధికారులు (TTD Officials) వివరించారు.
నిన్న స్వామివారిని 86,781 మంది భక్తులు దర్శించుకోగా 44,920 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం( Hundi Income) రూ. 3.47 కోట్లు వచ్చిందని వెల్లడించారు. ఉడిపి శ్రీపుతిగే మఠానికి చెందిన పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామిజీ ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ వేదపండితులు, ఆలయ అధికారులు పీఠాధిపతికి ఘనస్వాగతం పలికారు.