తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 25 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Sarvadarsan) 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు (TTD Officers) వివరించారు. నిన్న శ్రీవారిని 68,263 మంది భక్తులు దర్శించుకోగా 28,355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ.3.65 కోట్లు వచ్చిందని తెలిపారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రఘునాథ్ విశ్వనాథ్ దేశ్ పాండే శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.