తిరుమల : తిరుమలలో(Tirumala) కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లలో 26 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 నుంచి 15 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 58,637 మంది భక్తులు దర్శించుకోగా 21,956 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున కానుకలతో హుండీకి రూ. 3.69 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ(Garudaseva) వైభవంగా జరిగింది. రాత్రి సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.