అమరావతి : ఏపీలోని ఏలూరు(Eluru )జిల్లాలో పెద్దపులి(Tiger) సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. పాపికొండల నుంచి బయటకు వచ్చిన పులి బుధవారం తెల్లవారుజామున నిమ్మలగూడెం శివారు పాలకుంట చెరువు వద్ద పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులిని బంధించాలని కోరుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, పుద్దపులి సంచారంతో పాపికొండలకు పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు సమాచారం.